Category Archives: Uncategorized

శ్రీశ్రీ నవయువకవిత

చూసేది చూపించేది వినేది వినిపించేది అడిగేది అడిగించేది కనువిప్పును కలిగించేది చిరుదివ్వెను వెలిగించేది సరిదారిలో నడిపించేది శ్రీశ్రీ నవయువకవిత వెతికేది వెతికించేది రగిలేది రగిలించేది నిలిచేది నిలదీసేది సమాజాన్ని నిందించేది దౌర్జన్యాన్ని ప్రశ్నించేది తిరుగుబాటు నేర్పించేది శ్రీశ్రీ నవయువకవిత కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది మునుముందుకు సాగించేది పెనునిద్దర వదిలించేది పరిపూర్ణపు బ్రతుకిచ్చేది … Continue reading

Posted in Uncategorized | Leave a comment

చెలియా

నిను పొమ్మన్న నా కేకలకు ఈ దూరం బరువెరగదే నిన్నొదిలెల్లిన నా కోపానికి ఈ నొప్పి వ్యథతెలీదే తప్పనుకుని మన్నించేసి ఓ క్షణం ఎదురవవే చెలి నిను వెతికే నా పరుగులకు అలసట బదులయిందే నిను మరవని నా ఆశలకు నీ గురుతే బాధయిందే చీకటిలోనే బతికేస్తున్నా వెలుగే జల్లివెల్లవే చెలి

Posted in Uncategorized | Leave a comment

…కొన్ని

ఏంచేసినా జరగవు కొన్ని ఎవడడ్డైనా ఆగవు కొన్ని ఏదేమైన దక్కవు కొన్ని ఎన్నాళ్ళైనా మారవు కొన్ని ఎన్ని ఇచ్చినా తిరిగిరావు కొన్ని ఎలా చూసిన అర్ధంకావు కొన్ని ఎటు వెళ్ళినా దొరకవు కొన్ని ఎంత ప్రేమించినా మనవికావు కొన్ని

Posted in Uncategorized | Leave a comment

నీ కోసం

మౌనంగా దాచుకున్న మాటలన్నీ నీ కోసం కనుల్లో నింపుకున్న ఆశలన్నీ నీ కోసం పెదవుల్లో విచ్చుకున్న నవ్వులన్నీ నీ కోసం గుండెల్లో అల్లుకున్న కోరికలన్నీ నీ కోసం గమ్యానికి వెతుకుతున్న దారులన్నీ నీ కోసం అక్షరాలుగా రాసుకున్న భావాలన్నీ నీ కోసం హ్రుదయంలో పెంచుకున్న ప్రేమంతా నీ కోసం

Posted in Uncategorized | Leave a comment

ఎన్నో…. ఎనెన్నో

ఎన్నో ఆశలు ఎనెన్నో ఆశయాలు ఎన్నో ఊహలు ఎనెన్నో ఊగిసలాటలు ఎన్నో కష్టాలు ఎనెన్నో ఇష్టాలు ఎన్నో అవకాశాలు ఎనెన్నో అనుభవాలు ఎన్నో నిజాలు ఎనెన్నో అబద్ధాలు ఎన్నో కలలు ఎనెన్నో కధలు ఇంకా ఎన్నో…. ఎనెన్నో అవన్నీ కలిస్తేనే నువ్వు అవన్నీ కలిసి చెప్పే చరిత్రలోనే బతికుంటావు నువ్వు

Posted in Uncategorized | Leave a comment

సందేహాలుంటాయా చెలి……

అవునంటే కాదంటావు కాదంటే అవునంటావు ఏదన్నా తప్పంటావు చెలి నీకింక చెప్పెదెలా దగ్గరగా రానంటావు దూరాలే దారంటావు ఏదైనా గొడవంటావు చెలి నీతోటి నెగ్గెదెలా కన్నులతో చూసిందంతా జరిగేది కాదు మాటలుగా విన్నదంతా జరిగింది కాదు చెప్పలేని, చెప్పుకోని సంగతులన్నీ మనసెట్టి ఆలోచిస్తే సందేహాలుంటాయా చెలి……

Posted in Uncategorized | Leave a comment

.. నన్నే మరిచేపోయా

నాలా తననే చూసా తననే తనగా చూసా తనగా నన్నే చూసా నన్నే తనలో చూసా ఇలా చూస్తూ చూస్తూ తనలా నేనైపోయా నన్నే మరిచేపోయా

Posted in Uncategorized | Leave a comment

….ఎందుకు ఎందుకు ఈ యుద్ధం….

భూముల కోసం పోరాటం ఆదిపత్యపు ఆరాటం ఫలితం లేని కల్లోలం ఎన్నాళ్ళింకా ఈ పంతం కాల్పుల వలయంతో తూటాల ప్రవాహంతో ఏ శాంతిని నిలిపేది అశాంతితో నిండిన దారుల్లో రక్తపు మరకల్లో రాక్షసత్వపు ముసుగుల్లో ఏ గమ్యం వెతికేది మరణాలతో నిండిన గమనంలో ఎందుకు ఎందుకు ఈ యుద్ధం చేయని తప్పుల పెనుభారం మొదలెడితే ఆగని … Continue reading

Posted in Uncategorized | Leave a comment

……నను నేనే

తన రెప్పల అలికిడిలో చూసా నను నేనే తన చూపుల గారడీలో మరిచా నను నేనే తన తలపుల అలజడిలో కలిసా నను నేనే తన రేపటి స౦దడిలో వెతికా నను నేనే తన అడుగుల వెంబడిగా తరిమా నను నేనే తన గెలుపుల ఒరవడిలో గెలిచా నను నేనే నన్నే నాకే చేస్తోంది పరిచయం … Continue reading

Posted in Uncategorized | Leave a comment

నా జీవిత తాత్పర్యం

అనురాగం నాలో విరిసే ఉషా కిరణం ఆరాటం నాలో ఎగసే సంధ్యా కెరటం మదనం నాలో జరిగే అంతర్మఖ పోరాటం వదనం నాలో కరిగే భావాల శూన్యం పయనం నాలో స్వేచ్ఛా విహంగాల పవనం జీవితం నాలో సాగే తరంగాల సాగరం ఏకాంతం నాలో ఆలోచనల సంగ్రామం ఆశాంతం నాలో నాకే ప్రశ్నల సమరం వేదం … Continue reading

Posted in Uncategorized | Leave a comment